Header Banner

మరోసారి లేఆఫ్స్ చేపట్టిన గూగుల్.. ఈ సారి ఏ టీమ్స్ లో ఉద్యోగాలు పోతాయంటే..?

  Thu May 08, 2025 15:13        Employment

ప్రపంచవ్యాప్తంగా టెక్‌ ఉద్యోగాల కోత కొనసాగుతోంది. ఆర్థిక అస్థిరతతో గ్లోబల్‌ మార్కెట్లలో ఒత్తిడి, టారిఫ్‌ వార్‌, అమెరికాలో మాంద్యం భయాలు, ఏఐ వినియోగం పెరగడం త‌దిత‌ర కార‌ణాల‌తో కంపెనీలు త‌మ వ్య‌యాన్ని తగ్గించుకునే ప‌నిలోప‌డ్డాయి. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా గ్లోబల్ టెక్ దిగ్గజం ‘గూగుల్’ ఉద్యోగులకు మరోసారి లేఆఫ్‌లు ప్రకటించింది. సేల్స్‌, పార్ట్‌నర్‌షిప్‌ విభాగాలను పర్యవేక్షించే తమ గ్లోబల్‌ బిజినెస్‌ ఆర్గనైజేషన్‌లో 200 మంది ఉద్యోగులను తొలగించినట్లు స‌మాచారం. ఈ మేరకు కంపెనీకి చెందిన విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.

 

ఇది కూడా చదవండి: ఒక్క పోస్ట్‌తో పాక్‌కు ఇచ్చిపడేసిన సానియా మీర్జా.. ఆహా ఇది కదా కావాల్సింది..

 

'రాయిటర్స్‌'కు ఇచ్చిన ప్రకటనలో గూగుల్ ఈ మార్పులను చిన్న సర్దుబాట్లుగా అభివర్ణించింది. కంపెనీలో పునర్‌వ్యవస్థీకరణ చర్యల్లో భాగంగానే లేఆఫ్స్‌ ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇక నెల రోజుల వ్యవధిలోనే గూగుల్‌ తన ఉద్యోగులకు లేఆఫ్స్‌ ప్రకటించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గత నెలలో కూడా ఆండ్రాయిడ్‌ సాఫ్ట్‌వేర్‌, పిక్సెల్‌ ఫోన్లు, క్రోమ్‌ బ్రౌజర్లలో పనిచేసే ఉద్యోగులపై వేటు వేసింది. ఇక గతేడాది అంటే 2024 డిసెంబర్‌లో 10 శాతం మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకుముందు ఏడాది (2023) జనవరిలో 12 వేల మంది ఉద్యోగులకు గూగుల్ ఉద్వాసన పలికింది. కాగా, 2024 డిసెంబర్ నాటికి కంపెనీ 1,83,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను కలిగి ఉంది.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. టీడీపీ ఎంపీ కుటుంబంలో విషాదం! ఏపీకి చెందిన మరో వ్యక్తి..

 

జగన్ కు ఊహించని షాక్! లిక్కర్ స్కాం లో నిందితులకు సుప్రీంలో చుక్కెదురు!

 

తిరుపతి జిల్లాలో మరో కీలక ప్రాజెక్టు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి!

 

అలర్ట్.. 400కిపైగా ప్లైట్స్ క్యాన్సిల్.. 27విమానాశ్రయాలు మూసివేత.. ఏఏ ప్రాంతాల్లో మూతపడ్డాయంటే..

 

పాక్‌కు యూకే షాక్‌.. వీసాలపై పరిమితులు! కొత్త నిబంధనల్లో భాగంగా...

 

ఏపీలో వారికి గుడ్ న్యూస్..! తల్లికి వందనం ఎప్పటినుంచంటే..?

 

ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు!

 

పహల్గాం ఘటనపై సోనూ నిగమ్‌ సంచలన కామెంట్స్.. షాకిచ్చిన పోలీసులు..

 

టీడీపీకి తీరని లోటు..! సీనియర్ నేత మాజీ ఎంపీ కన్నుమూత!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #UPIPayment #Moneytransfer #MoneyTransferProblem #Payment #OnlinePayment #OnlinePaymentProblem